స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన లెనోవో సరికొత్త రికార్డ్ సృష్టించింది. లెనోవో విడుదల చేసిన వైబ్ కె4 నోట్ ఫోన్లు ఇండియాలో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయినట్లు సంస్థ తెలిపింది. జనవరిలో విడుదలైన ఈ మోడల్ మార్చి నుంచి ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 5లక్షల ఫోన్లు విక్రయించినట్లు లెనోవో యాజమాన్యం వివరించింది. మార్చి 19 నుంచి ఈ ఫోన్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. కేవలం 41 రోజుల్లో ఈ స్థాయిలో తమ కంపెనీ ఫోన్లు అమ్ముడుపోవడం పట్ల సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని ఉత్తమ మోడళ్లను అందిస్తామని లెనోవో కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Post a Comment
Thank U For ur Comments