నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రారంభించేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి.. ఈ నెల 9వ తేదీ నుంచి మొరాకోలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేయనున్నారు. ఈ సినిమా స్టార్టింగ్ షెడ్యూలే యుద్ధ సన్నివేశాలతో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య కేరీర్‌లో వందో సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. బాలయ్య సినిమా అంటేనే ఇటీవల హీరోయిన్ల సమస్య వచ్చిపడుతోంది. లెజెండ్‌లో సోనాల్, రాధిక నటించారు. లయన్‌లో రాధికను మళ్లీ రిపీట్ చేశారు. త్రిష కూడా నటించింది. డిక్టేటర్‌లో మరోసారి సోనాల్‌ను రిపీట్ చేయడంతో పాటు అంజలి కూడా నటించింది. ఇక శాతకర్ణిలో హీరోయిన్ గా మొదట నయనతారను అనుకున్నారు. ఆమె చిరు 150కు ఫిక్స్ అవ్వడంతో తర్వాత కాజల్ ను సంప్రదించాడు దర్శకుడు క్రిష్. కానీ ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో కూడా చేయనని చెప్పేసింది. ఆ తర్వాత గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించారు కానీ.. ఇది చాలా మెచ్యూర్డ్ అని అంతటి కేరక్టర్ చేయలేనని తేల్చేసింది ఇల్లీ బేబీ. డైరెక్టర్ మాత్రం సీనియర్ నటీమణి అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని భావించడంతో.. తన ప్రయతాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ని ఈ రోల్ కి ఒప్పించేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్నాడన్నది సమాచారం.
Source: Film70mm
Source: Film70mm
Post a Comment
Thank U For ur Comments