మైక్రోసాఫ్ట్ విండోస్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను మురిపిస్తూ ఉంటుంది. విండోస్ 10కు వార్షిక అప్‌డేట్ త్వరలోనే విడుదల కాబోతోంది. దీనిలోని ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. త్వరలో రాబోతున్న వార్షిక అప్‌డేట్ లేదా రెడ్‌స్టోన్‌లో ఉండే ఫీచర్లు ఏమిటంటే...

సాధారణ పాస్‌వర్డ్ కన్నా అత్యధిక భద్రతనిచ్చే బయోమెట్రిక్ సెక్యూరిటీ సదుపాయం రాబోతోంది. దీనిని విండోస్ యాప్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లతో ఉపయోగించుకోవచ్చు.

స్టైలీని ఉపయోగించే యాప్స్, ఫీచర్లను మరింత సమర్థంగా వాడుకోవడానికి వీలుగా వర్క్‌స్పేస్‌ ఉంటుంది. స్కెచ్‌లు గీసేందుకు స్కెచ్ ప్యాడ్, స్క్రీన్‌షాట్స్‌ సమాచారాన్ని రాయడానికి స్క్రీన్ స్కెచ్, నోట్స్ కోసం స్టిక్కీ నోట్ విండోస్10లో కొత్తగా చేరుతున్నాయి.

విండోస్ 10లో స్టార్ట్‌ మెనూ బాగుందని చాలా మంది అంటున్నారు. వార్షిక అప్‌డేట్‌లో దీనికి మరిన్ని ఆకర్షణలు రాబోతున్నాయి. అన్ని యాప్స్‌ను శాశ్వతంగా చూడటానికి స్టార్ట్ మెనూలో 'ఆల్ యాప్స్' బటన్ ఉంటుంది. ఇది టాబ్లెట్ మోడ్‌లో ఉంటుంది.

టాస్క్‌బార్‌ను ఆటోమేటిక్‌గా హైడ్ చేయవచ్చు. ఎక్కువ నోటిఫికేషన్లను చూపించేవిధంగా యాక్షన్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. కోర్టానా నోటిఫికేషన్లకు కూడా సపోర్టు చేస్తుంది.

ఎక్స్‌బాక్స్ వన్‌కు కోర్టానా సపోర్టు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ అప్‌డేట్‌తో వస్తున్నాయి. కొత్త గేమ్స్, ఛాలెంజెస్, ట్రిక్స్‌ను కనుగొనడానికి కూడా సాయపడే ఫీచర్లు ఉన్నాయి. గేమ్ డెవలపర్లు యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫారంను ఉపయోగించుకుని ఎక్స్‌బాక్స్ వన్, విండోస్ 10 కోసం గేమ్స్‌ను డెవలప్ చేయవచ్చు. డెవలపర్ కిట్‌గా ఎక్స్‌బాక్స్ డెవలపింగ్ మోడ్ మారుతుంది. దీనివల్ల డెవలపర్లకు, వినియోగదారులకు కొత్త అవకాశాలు వస్తాయి.

విండోస్ 10 ఇకో సిస్టమ్‌‌లో కోర్టానా కీలకమైనది. దీనికి రాబోతున్న అప్‌డేట్ మరిన్ని సదుపాయాలు కల్పిస్తుంది. లాక్ స్క్రీన్ నుంచి కూడా కోర్టానాను యాక్సెస్ చేసుకోవచ్చు. షేర్ ఫంక్షనాలిటీ ద్వారా ఫొటోలు, యాప్‌ల నుంచి రిమైండర్లను క్రియేట్ చేయవచ్చు.

టాస్క్‌బార్‌లో ఓపెన్ చేసిన యాప్‌లకు నోటిఫికేషన్ బ్యాడ్జ్‌లు వచ్చేలా అప్‌డేట్‌ను రూపొందించారు. యూజర్ చూడవలసిన నోటిషికేషన్లు ఒక్కో యాప్‌కు ఎన్ని ఉన్నాయో తెలియజేస్తుంది. వీటిని కస్టమైజ్ చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది.

మైక్రోసాఫ్ట్ కొత్త ఎడ్జ్ బ్రౌజర్ చాలా బాగుంటుంది. వార్షిక అప్‌డేట్ ద్వారా మరికొన్ని సదుపాయాలు రాబోతున్నాయి. డెవలపర్లకు, సాధారణ యూజర్లకు ఉపయోగపడేలా అప్‌డేట్ చేస్తున్నారు.క్రోమ్ వంటి ఎక్స్‌టెన్షన్లనే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉపయోగిస్తుంది. విండోస్ స్టోర్‌లో ఎక్స్‌టెన్షన్లు అందుబాటులో ఉంటాయి.

వీటన్నిటికన్నా అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏమిటంటే ... బాష్ షెల్ అని చెప్పవచ్చు. విండోస్ 10కు రియల్, నేటివ్ బాష్ సపోర్టు‌ను ఈ అప్‌డేట్ ఇస్తుంది. లైనక్స్ కమాండ్ లైన్ టూల్స్‌కు కూడా ఫుల్ సపోర్టు ఇవ్వగలదు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top