సీఎం దిగ్ర్భాంతి.. మంత్రులు, నాయకుల సంతాపం 
వైద్యుల నిర్లక్ష్యమే : బంధువులు 
నేడు రాయికల్‌లో అంత్యక్రియలు 
హైదరాబాద్‌/మోండా, ఏప్రిల్‌ 16 (ఆంధ్ర జ్యోతి): ఆపరేషన్‌ వికటించి బ్రెయిన్‌డెడ్‌ అయి న సీనియర్‌ జర్నలిస్టు, మంత్రి ఈటల రాజేందర్‌ పీఆర్వో రవీందర్‌ (42) శనివారం సాయం త్రం కన్నుమూశారు. బ్రెయిన్‌ అన్యూరిజం వ్యాధికి చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వైద్యు లు శస్త్రచికిత్స చేసి మెదడుకు రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకులను తొలగించి స్టంట్లు అమర్చారు. అయితే, శస్త్రచికిత్స విఫలమై స్టంట్ల నుంచి రక్తస్రావమైంది. దీంతో ఆయన శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. బం ధువుల కోరిక మేరకు వెంటిలేషన్‌పై పరిశీలనలో ఉంచారు. కానీ, ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో శనివారం సాయంత్రం 6:12కు కన్నుమూసినట్లు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌ ప్రకటించారు. రవీందర్‌ మృతి వార్త తెలియగానే మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కవిత ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. అయితే, శస్త్ర చికిత్స తర్వాత నిరంతరం పర్యవేక్షించాల్సిన వైద్యుల నిర్లక్ష్యంతోనే రవీందర్‌ మరణించాడని ఆయన బంధువులు ఆరోపించారు.
 
ఆస్పత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ప్రాణాల మీదకు రాగానే టర్కీ నుంచి వచ్చి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు పారిపోయాడన్నారు. రవీందర్‌ అంత్యక్రియలుఆయన స్వస్థలమైన కరీంనగర్‌ జిల్లా రాయి కల్‌ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరుగుతా యని కుటుంబ సభ్యులు తెలిపారు.. రవీందర్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్య క్తం చేశారు. మంత్రులు హరీశరావు, జోగురామన్న, జగదీశ రెడ్డి, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు విఠల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌, టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి, తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు.
 
నాన్నేడని అడుగుతున్నారు.. ఏమని చెప్పను : భార్య 
నాన్నేడని పిల్లలు అడుగుతున్నారు.. వారికి ఏమని సమాధానం చెప్పను.. అంటూ రవీందర్‌ భార్య సరిత కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నాన్నకు జ్వరం వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నాడని పిల్లలు శృతి, సహస్రలకు రెండు రోజులుగా చెప్పాను. ఇప్పుడు వారికి ఏమని చెప్పాలి. నన్నూ నీతో తీసుకెళ్లు.. అంటూ రవీందర్‌ మృతదేహం వద్ద సరిత చేసిన రోదనతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పరామర్శకు వచ్చిన హోంమంత్రి నాయినిని జర్నలిస్టులు నిలదీశారు

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top