ఎవరికి పడితే వారికి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నారా.... ఎక్కడపడితే అక్కడ నెంబర్‌ను వాడేస్తున్నారా..? వెబ్‌సైట్ లింక్స్ ఓపెన్ అవడానికి, జాబ్ ఆఫర్లను తెలుసుకోవడానికంటూ ఫోన్ నెంబర్లను ఉపయోగిస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. కేవలం ఫోన్ నెంబర్ ఒక్కటి తెలిస్తే చాలు... మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మీరు ఎక్కడ ఉన్నదీ తెలిసిపోతుంది. మీ వ్యక్తిగత వివరాలను కూడా నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎవరెవరితో మాట్లాడారు. ఎవరికి ఎన్ని మెసేజ్‌లు చేశారు.. ఎవరితో ఏం మాట్లాడారు వంటి వివరాలను తెలుసుకునే టెక్నాలజీని హ్యాకర్లు సృష్టించారని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు తమ దేశ పౌరులపై నిఘా కోసం ఈ రకమైన టెక్నాలజీని ఉపయోగిస్తుండగా భారత్‌కు ఇప్పుడిప్పుడే ప్రమాదం దగ్గరవుతోందని తేలింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా.. నెంబర్ సాయంతో ఫోన్ లోని ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించే విధంగా టెక్నాలజీని వాడుతున్నారని తేలింది. 1975 నుంచి అందుబాటులో ఉన్న ఫ్రోటోకాల్ సిగ్నలింగ్ సిస్టమ్ 7 విధానాన్ని(ఎస్‌ఎస్7) హ్యాకర్లు బాగా వాడుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు.
Post a Comment
Thank U For ur Comments