రాయగఢ్: ఓ బాలిక శివుని పట్ల మూఢ భక్తిని ప్రదర్శించింది. తన నాలుకను కోసుకుని శివలింగానికి అర్పించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సంగీతారాయ్ గ్రామంలో పురాతన శివాలయం ఉంది. చదువుపై ధ్యాస లేక చిన్నప్పటి నుంచి స్కూల్ మానేసిన 11 ఏళ్ల చమేలీ సిదార్, శనివారం నుంచి అక్కడే ఉండి పూజలు చేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కత్తితో తన నాలుక కోసుకుని శివలింగానికి అర్పించింది. ఆ తర్వాత సృహ కోల్పోయింది. కొద్ది సేపటి తర్వాత తేరుకుని తిరిగి పూజలు ప్రారంభించింది.
విషయం తెలిసిన పోలీసులు, జిల్లా అధికారులు అక్కడికి వచ్చారు. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. శివుడి దయతో వైద్య సహాయం లేకుండానే ఆమె కోలుకుంటుందని గట్టి నమ్మకంతో చెప్పారు. దీంతో చేసేది లేక ఓ డాక్టర్‌ను ఉంచి అధికారులు వెనుదిరిగారు.
గతంలోనూ ముగ్గురు బాలికలు ఆ శివాలయంలో తమ నాలుకలు కోసుకుని శివునికి అర్పించారు. ఎలాంటి చికిత్స లేకుండానే వారు కోలుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. చమేలీ కూడా కాస్త కోలుకుందని, ఆమె పరిస్థితి బాగానే ఉందని గ్రామ సర్పంచ్ గోపాల్ బుధవారం పోలీసులకు తెలిపారు.

Post a Comment
Thank U For ur Comments