- తాటిముల్లుతో తయారు చేసిన ఏటికొప్పాక హస్తకళాకారుడు
ఎలమంచిలి, ఏప్రిల్ 14: జాతీయ అవార్డు గ్రహీత.. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు శ్రీశైౖలపు చిన్నయాచారి చేతిలో మరో కళాఖండం రూపుదిద్దుకుంది.
తాటిముల్లుతో ఆయన తయారు చేసిన ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణుల కళాఖండం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ బొమ్మలు ఒక్కొక్కటీ 0.5 మిల్లీమీటర్లు ఉండగా, నాలుగు ప్రతిరూపాలూ కలిపి 3 మిల్లీమీటర్ల సైజులో ఉన్నాయి. వీటిని తయారు చేయడానికి రోజుకు 12 గంటలచొప్పున 8 రోజులపాటు శ్రమించినట్టు చిన్నయాచారి తెలిపారు.
Post a Comment
Thank U For ur Comments