చట్టాన్ని నిలదీస్తామనే మీడియా సంస్దలే…చివరకు చట్టానికి అడ్డంగా దొరకిపోవటం విషాదమే. కొత్తగా రిలీజైన సినిమాని ఏదైనా ధియోటర్లో అక్రమంగా పైరసీ చేస్తూంటే మీడియావాళ్లు వాలిపోయి అందరిముందూ పెడుతూంటారు. అలాంటి మీడియావారే తెగించి, తాజాగా రిలీజైన ఓ కొత్త చిత్రాన్ని తమ కెమెరాతో షూట్ చేస్తూ దొరికిపోతే పరిస్దితి ఎలా ఉంటుంది..ఎంత దారుణంగా ఉంటుంది. తమిళనాడుకి చెందిన పోలీమర్ టీవి ఛానెల్ వారు అలాంటి దురాగతానికి తెగబడ్డారు. విజయ్ తాజా చిత్రం ధేరీ ని కోయంబత్తూరులోని శాంతి ధియోటర్ లో పైరసీ కోసం షూట్ చేస్తూండగా దొరికిపోయారు. విజయ్ ఫ్యాన్స్ హాల్లో షూట్ చేస్తున్న కెమెరామెన్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. లోకల్ విజయ్ ఫ్యాన్స్ అశోశియేషన్ అధ్యక్ష్యుడు సంపత్ మాట్లాడుతూ.. "గురువారం ఉదంయ, విజయ్ ఫ్యాన్స్ ..ఓ వ్యక్తి ధియోటర్లో కెమెరా పట్టుకుని సినిమా ని షూట్ చేస్తూండటం గమనించారు. వారు ఆ కె మెరామెన్ ని షూట్ చేయటం ఆపమని అడిగారు. అయితే అందుకు కెమెరామెన్ ఒప్పుకోలేదు. దాంతో బలవతంగా ఆపుచేసి పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. అతను ఓ ప్రెవేట్ కెమెరామెన్ అనీ, అలాంటి పనులు కోసం అప్పుడప్పుడూ నియమిస్తూంటారని ," చెప్పుకొచ్చారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top