న్యూఢిల్లీ: ఇటీవల భారత్‌లో పర్యటన కోసం న్యూఢిల్లీ వచ్చిన బ్రిటన్ యువరాజు విలియమ్స్, యువరాణి కేట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అయితే బ్రిటన్ వారి సంప్రదాయమే అయిన షేక్హ్యండ్ను వారికిచ్చారు. మోదీ షేక్‌హ్యాండ్‌ను మామూలుగానే బలంగా ఇస్తారు. విలియమ్స్‌కు కూడా మోదీ బలంగానే షేక్‌హ్యండ్ ఇచ్చారు. అయితే బాగా ఫెయిర్‌గా ఉండటం వల్లనో ఏమో విలియమ్స్ చేయిపై మోదీ షేక్‌హ్యాండ్ గుర్తులుండిపోయాయి. చేయి కమిలిపోయిందనేంతగా. దీన్ని కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
Post a Comment
Thank U For ur Comments