డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌పై పలువురు డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారు. గతంలో పూరి దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరి ఇంటి దగ్గర రభస చేసి... పూరి ఆఫీస్‌పైనా కూడా దాడి చేశారు. రాబోయే కాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే ఇవ్వాలని గొడవ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేసిన విషయంపై పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై 323, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Post a Comment
Thank U For ur Comments