ఎగరడానికి తన రెక్కలను కిందకీ పైకీ ఆడిస్తుంటుంది. కిందికి ఆడించినప్పుడు పక్షి కింది భాగానికి గాలి చేరి పక్షిని పైకి నెడుతుంది. అది ఆ పక్షి చలనానికి సహకరిస్తుంది. ఆ తరువాత రెక్కలను పైకి ఎత్తినప్పుడు పక్కలనున్న గాలి పైకి నెట్టబడుతుంది. అప్పుడు ఆ పక్షి వెనుక ఐమూలగా వేరే పక్షి ఎగురుతుంటే... అక్కడి గాలి అంతకు మునుపే పైకి నెట్టబడి ఉండటం వల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువ శ్రమపడకుండానే వెనకనున్న పక్షి తేలికగా ఎగరవచ్చు. అదే ముందున్న పక్షికి సరిగ్గా వెనుక ఎగిరితే అది కిందికి నెట్టిన గాలి వెనక పక్షికి అవాంతరంగా ఉంటుంది. అప్పుడది ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. అందువల్ల ఒక పక్షి ముందు ఎగురుతుంటే దాని వెనుక రెండువైపులా మిగతా పక్షులన్నీ ఐమూలగా ఒకదాని వెనుక ఒకటి ఎగురుతుంటాయి. వలసపోతున్నప్పుడు పక్షులు చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి ముందు స్థానానికి ఒక దాని తరువాత ఒకటి మారుతూ అలసిపోకుండా ఉండేందుకు V ఆకారంలో ప్రయాణిస్తాయి.
Post a Comment
Thank U For ur Comments