సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. వద్దనుకునే రికార్డులు ఎన్నో అయన ఖాతాలో చేరిపోతున్నాయి. తాజాగా మరో చెత్త రికార్డ్ సర్దార్ సొంతం చేసుకోబోతుంది. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమా థియేటర్స్ నుంచి రాబట్టాల్సిన మొత్తం 58 కోట్లు. కానీ ఆ సినిమా వసూలు చేసింది మొత్తం 29 కోట్ల లోపే. అంటే దాదాపు 29 కోట్లు నష్టం. ఇప్పుడు ఈ చెత్త రికార్డుని కొట్టేపనిలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చేరింది. వాస్తవంగా సర్దార్ సినిమా వసూళ్లు గౌరవప్రదమైన వసూళ్లే అయినా లక్ష్యం బాగా పెద్దది కావడంతో నష్టపరిమానం కూడా పెద్దగ కనిపిస్తుంది.
ఈ సినిమా చేసిన బిజినెస్ దృష్టిలో పెట్టుకుంటే సేఫ్ జోన్ లోకి రావడానికి దాదాపు 91 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా సర్దార్ ఇప్పటికే సుమారు 47 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ వారంలో నాలుగు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకాస్త రన్ వస్తుందని అనుకున్నా కూడా 55 కోట్లకు కొంచెం అటు ఇటుగా రాబడుతుంది. అంటే దాదాపు 35 కోట్ల వరకూ నష్టాన్ని మనం ఊహించొచ్చు.అంతకంటే తక్కువ నష్టంతో బయటపడితే అద్భుతమే.కాకపోతే "1 నేనొక్కడినే" సినిమాతో పోల్చినపుడు మహేష్ సినిమాకి 50% వరకూ నష్టం వస్తే,"సర్దార్…" సినిమాకి ఆ నష్టం 40% వరకే పరిమితం కాబోతుంది…
Post a Comment
Thank U For ur Comments