ఏ జన్మలో ఏ పాపం చేశానో... పుట్టెడు దుఃఖంలో సుగుణాదేవి
•నక్కపల్లి ఘటనలో భర్త, కుమారుడిని పోగొట్టుకున్న అభాగ్యురాలు
•నాన్న, అన్నయ్య ఏరని పాప అడుగుతోంది
•వాళ్లు లేని జీవితాన్ని తలుచుకుంటేనే భయమేస్తున్నది
•విషాదం నుంచి కోలుకోని చిరంజీవిరాజు కుటుంబం
విశాఖపట్నం: జీవితాంతం తోడునీడగా వుండాల్సిన భర్త, పేగు తెంచుకుని పుట్టిన కొడుకు ఒకేసారి దూరం కావడంతో ఆమె తీవ్ర దుఃఖసాగరంలో మునిగి పోయింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో... ఈ జన్మలో భగవంతుడు నాకీ శిక్ష విధించాడు అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నది. రంపపు కోత కంటే కఠినమైన శిక్ష నాకు విధించాడని వాపోతున్నది ఆదివారం నక్కపల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడిని కోల్పోయిన దాట్ల సుగుణాదేవి. పాయకరావుపేట నుంచి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీకొడుకులు దాట్ల చిరంజీవిరాజు, దాట్ల అనంతసాగర వర్మలను వెదుళ్లపాలెం వద్ద కారు ఢీకొనడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు (అడ్డరోడ్డు)లో వీరి కుటుంబాన్ని మంగళవారం 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధి కలిసి మాట్లాడగా, తన భర్త, కుమారుడిని మృత్యుదేవత తన్నుకుపోయిందంటూ సుగుణాదేవి కన్నీటిపర్యంత మయ్యారు. సంఘటన జరిగి మూడు రోజులు అయినప్పటికీ ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
ఎంతో నీరసంగా వున్న ఆమె...భర్త, కుమారుడిని పదేపదే గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ''స్కూల్‌కు వెళ్లేముందు అమ్మా టాటా అని చెప్పేవాడు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఇంటిలో వున్న సమయంలో కూడా అమ్మా.... అమ్మా అంటే వెన్నంటే తిరిగేవాడు. నాతోనే ఎక్కువగా వుండేవాడు. మూడు రోజుల నుంచి ఆ పిలుపు లేదు. చూడ్డానికి ఆ రూపం లేదు. చిన్నవయసులోనే ఒకేసారి భర్త, బిడ్డను దూరం చేసి దేవుడు నాకు అన్యాయం చేశాడు. వాళ్లు లేని జీవితాన్ని తలుచుకుంటేనే భయమేస్తున్నది'' అంటూ ఆమె దుఃఖించారు. ఈ సందర్భంగా చిరంజీవిరాజు చదువు, ఉద్యోగం, తనతో వివాహం, పిల్లలు, వారి చదువు కోసం పాయకరావుపేటకు మకాం మార్చడం గురించి ఆమె వివరించారు.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
అడ్డురోడ్డులో మా ఇంటికి, స్కూల్‌కు మధ్య జాతీయ రహదారి వుండడంతో పిల్లలను ఇక్కడ స్కూల్‌కు పంపిస్తే రోడ్డు దాటడం ఇబ్బందిగా వుంటుందన్న ఉద్దేశంతో రెండేళ్ల కిందట కుటుంబాన్ని పాయకరావుపేటకు మార్చాం. కుమారుడిని చేర్పించిన పాఠశాలకు సమీపంలోనే ఇంటిని అద్దెకు తీసుకున్నాం. చిరంజీవిరాజు కంపెనీ బస్సులోనే వెళ్లివచ్చేవారు. ప్రతి ఆదివారం అడ్డరోడ్డులో వుంటున్న తల్లిదండ్రులు సీతాదేవి, వెంకటపతిరాజును చూసేందుకు ఆయనొక్కరే వెళ్లేవారు. ఎప్పటి మాదిరిగానే గత ఆదివారం కూడా బయలుదేరారు. నానమ్మ, తాతయ్యను చూసేందుకు తాను కూడా వస్తానని కుమారుడు అనంతసాగరవర్మ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరూ కలిసి బైక్‌పై బయలుదేరి వెళ్లారు. అరగంటలోనే భర్త, కుమారుడు ప్రమాదానికి గురైనట్టు సమాచారం వచ్చింది. సీరియస్‌గా వుందని బంధువులు చెప్పారు. కొనఊపిరి ఉంటే చాలు, ఎంత ఖర్చయినా సరే వైద్యం చేయించుకోవచ్చని అనుకున్నాను. కానీ కొద్దిసేపటికి దుర్వార్త చెవిన పడింది. వారిద్దరూ ఇకలేరని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. వారి లేని జీవితం శూన్యంగా మారింది. నాన్న, అన్నయ్య ఏరని కుమార్తె మహేశ్వరి అడుగుతుంటే కళ్ల నుంచి నీరు ఉబికివస్తూ, ఏం చెప్పాలో తెలియడం లేదు. స్కూటర్‌ను ఎంతో జాగ్రత్తగా నడుపుతారు. పిల్లలను తీసుకెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా వుంటారు. ఆ రోజు(ఆదివారం) కూడా నెమ్మదిగానే వెళుతున్నారు. అయినా సరే మృత్యువు కారు రూపంలో వచ్చి నా భర్త, బిడ్డ ప్రాణాలను తీసుకువెళ్లింది.
పుత్రశోకంలో తల్లిదండ్రులు
ఈ విషాదం నుంచి చిరంజీవిరాజు తల్లిదండ్రులు సీతాదేవి, వెంకటపతిరాజు కోలుకోలేకపోతున్నారు. కొడుకు, మనుమడు ఒకేసారి దూరం కావడాన్ని వారు జీర్ణించు కోలేకపోతున్నారు. మూడు రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా కన్నీటిని దిగమింగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిరాజు తల్లి సీతాదేవి తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
చిరంజీవిరాజు మామ (సుగుణాదేవి తండ్రి) మంతెన రామరాజు తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కుమిలిపోతున్నారు. 'మా కుటుంబంలో బాగా చదువుకున్నది నా తమ్ముడొక్కడే. వాడిని చూసి ఎంతో పొంగిపోయేవాడిని. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు' అంటూ చిరంజీవిరాజు సోదరుడు సాంబమూర్తిరాజు కన్నీటిపర్యంతం అయ్యారు.
నిరుపేద కుటుంబం
పెదగుమ్ములూరుకు చెందిన దాట్ల చిరంజీవిరాజు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీషు చదివారు. నక్కపల్లి మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమ హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేవో మల్లవరానికి చెందిన సుగుణాదేవితో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు అనంతసాగరవర్మ(7), మూడేళ్ల కుమార్తె ఉమామహేశ్వరి వున్నారు. చిరంజీవిరాజుది పేద మధ్యతరగతి కుటుంబం. సుమారు ఎకరం భూమి తప్ప స్థిరాస్తులంటూ ఏమీలేవని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిరంజీవిరాజు మృతితో భార్య సుగుణాదేవి, కుమార్తె ఉమామహేశ్వరి ఒంటరి వారయ్యారు.

Post a Comment
Thank U For ur Comments