కరాచీ: మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం చావుబతుకుల మధ్య ఉన్నాడు. దావూద్ కాళ్లకు గ్యాంగ్రీన్ అనే కొరుకుడు వ్యాధి ముదిరిపోయిందని, బతకడం కష్టమే అని వైద్యులు చెబుతున్నారు. అర్జంటుగా పాకిస్థాన్ నుంచి ఇతర దేశాలకు దావూద్‌ను తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. అర్జంటుగా దావూద్ రెండు కాళ్లూ తొలగించాలని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఉండే దావూద్‌కు ప్రస్తుతానికి కరాచీలోని లియాఖత్ నేషనల్ హాస్పిటల్లో, కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. రక్త ప్రసరణ జరగకపోవడం, హై బీపీ, షుగర్ ఉండటం వల్ల జబ్బు నుంచి కోలుకునే పరిస్థితి కనపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. రక్తం పోతుండటం వల్ల ఆక్సిజన్ అందక ఎర్రరక్త కణాలు నశిస్తున్నాయి. రెండు కాళ్లూ ఇప్పటికే పూర్తిగా చచ్చుబడిపోయాయని, దావూద్ శరీరంలోని మిగతా భాగాలకు కూడా కొరుకుడు వ్యాధి సోకుతోందని తెలిసింది. మరోవైపు దావూద్‌ను ఇతర దేశాలకు తరలించాలన్న వైద్యుల డిమాండ్‌ను పాక్ ఆర్మీ, ఐఎస్ఐ రెండూ ఒప్పుకోవడం లేదని తెలిసింది. అవసరమైతే ఆర్మీ వైద్యులే చికిత్స చేస్తారని సైన్యం, ఐఎస్ఐ స్పష్టం చేసినట్లు సమాచారం.
Post a Comment
Thank U For ur Comments