కోహినూర్.. భారతీయులకు సంబంధించినంత వరకు ఇది చాలా విలువైనది. ఎంతో విలువైనదాని గురించి సంబోధించేటపుడు దానిని కోహినూర్‌తో పోల్చడం మనకు అలవాటే. ఈ వజ్రం గురించి ఎప్పట్నుంచో భారత్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా కోహినూర్‌ను బ్రిటీష్ వారు కొల్లగొట్టలేదు, దోచుకెళ్లలేదు. ఓ మహారాజు దానిని ఇంగ్లండ్ మహారాణికి బహుమతిగా ఇచ్చేశాడు. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లూరులో దొరికినట్టు కొంతమంది చెబుతున్నారు.
మరికొంత మంది రాయలసీమ వజ్రాల గనుల్లో దొరకిందని వాదిస్తున్నారు. మొత్తానికి ఇది కాకతీయుల కాలంలో వెలుగులోనికి వచ్చింది. దీని బరువు 793 కేరెట్స్ (158.6 గ్రాములు). దానిని చాలా కాలంపాటు కాకతీయ రాజులే కాపాడారు. అనంతరం 1310లో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ వరంగల్‌ను ముట్టడించి ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అలా అనేకమంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారిన ఈ వజ్రాన్ని 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ దక్కించుకున్నాడు. అతని తదనంతరం ఆ వంశ రాజు అయిన షాజహాన్ కోహినూర్‌ను తన నెమలి సింహానానికి అలంకరించాడు.
Post a Comment
Thank U For ur Comments