తైవాన్: చైనాలోని తైవాన్‌లో ఓ అరుదైన శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 4,800 ఏళ్ల కిందటి మనిషి శిలాజంగా దీన్ని గుర్తించారు. చైనాలోని తైవాన్‌కు సమీపంలోని తాయ్‌చూంగ్ సిటీలో ఈ శిలాజం బయటపడింది. తైవాన్‌లోని నేషనల్ మ్యూజియంలో దీన్ని భద్రపరిచారు. అయితే అన్ని పురాతన శిలాజాల కన్నా దీనికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓ తల్లి తన బిడ్డను భుజాలపైకి ఎత్తుకున్నట్టుగా ఈ శిలాజం కనిపిస్తోంది. చైనాలో మానవ సంబంధాలు, అనుబంధాలు అప్పటి నుంచే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అరుదైన శిలాజ రూపాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తికనబరుస్తుండటం విశేషం.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top