సినిమాల్లో లావణ్య త్రిపాఠి ఎక్కువగా సంప్రదాయ దుస్తు ల్లోనే కనిపిస్తుంది. మోడ్రన్ డ్రస్సులు వేయడం చాలా తక్కువ మొదటి సినిమా అందాల రాక్షసి నుంచి మొన్న వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా వరకూ అన్నీ సంప్రదాయ సిద్ధమైన క్యారెక్టర్లే. కానీ తనకు మోడ్రన్ డ్రస్సులంటే ఎక్కువ ఇష్టమట! సినిమాల్లో వీటిని వేసుకునే సందర్భం ఇంత వరకూ రాలేదన్నది లావణ్య బాధ! అలాంటి సినిమా ఒక్కటి వస్తే చాలు మోడ్రన్ డ్రస్సులో అదర గొట్టేస్తానం టోంది.అమ్మడు ప్రస్తుతం తన తొలి తమిళ సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులో ఉంది. అక్కడే సందీప్ కిషన్ తో షూటింగ్. అయితే ఇప్పుడు బ్రేకిచ్చారు. మరి ఈ వేసవి సెలవలను ఎంజాయ్ చేయడానికి ఈమె మహాబలిపురం వెళ్లింది. అప్పట్లో పాత తెలుగు సినిమాల్లో ఈ మహాబలిపురాన్ని తెగ చూపిం చేవారు కాని.. ఈ మధ్య కాలంలో మనోళ్ళు అక్కడ షూటింగే చేయలేదు. అయితే మహాబలిపురంలో ఓ బీచ్ రీసార్టులో కూర్చుని.. ఇది స్వర్గం బాబోయ్ అంటూ చెప్పుకొచ్చింది రాక్షసి. మరి తమిళనాడులో ఎంజాయ్ చేయాల నుకునే హాలిడే లవర్లు.. వాట్సాప్ మెసేజ్లు చూసి భయపడ కుండా.. హ్యాపీగా మహాబలిపురం వెళ్ళిరండి. ఏమో మధ్య దారి లో మీకు లవాణ్య త్రిపాఠి కనిపించవచ్చు.. కనిపించి ఒక సెల్ఫీ దిగే ఛాన్సు కూడా ఇవ్వొచ్చు.
Post a Comment
Thank U For ur Comments