స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో యువత సెల్ఫీల మోజు మరింత పెరిగిపోతోంది. మొదట్లో సరదా కోసం దిగే సెల్ఫీలు కాస్తా... సాహసం చేస్తూ దిగాలనే స్థాయికి చేరాయి. క్రూర మృగాలతో సెల్ఫీ, శవంతో సెల్ఫీ, రైలు వస్తుండగా పట్టాలపై నిల్చుని సెల్ఫీ... ఇలా సెల్ఫీల పిచ్చి యువతకు బాగా ముదిరింది. మొన్నటికి మెన్న హైదరాబాద్‌లోని జూ పార్క్‌లో ఎత్తైన రాయిపై నిల్చుని సెల్ఫీ దిగుతుండగా ఓ విద్యార్థి కిందపడి మృతి చెందాడు. ఇలా సెల్ఫీల మోజులో యువత ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు.
తాజాగా కేరళలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి శ్రీలాల్ అనే 37 ఏళ్ల వ్యక్తి కిలమనూర్‌లో ఓ ఆలయంలో ఉన్న ఏనుగుకు అరటిపండు పెట్టాడు. ఏనుగును మచ్చిక చేసుకుని మావటివాడు నిద్రిస్తున్న సమయంలో దానితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఏనుగు తొండంతో ఒక్కటి పీకేసరికి దెబ్బకు కుప్పకూలాడు. శ్రీలాల్ బాధతో కేకలు వేయడంతో అందరూ వచ్చి అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. సెల్ఫీలంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఆ ఇష్టం మితిమీరితే అదో మానసిక వ్యాధిలా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Post a Comment
Thank U For ur Comments