అవును.. మీరు వింటున్నది నిజమే.... అతడి గుండె సుమారు 45నిమిషాల పాటు ఆగిపోయింది.. వైద్య శాస్త్రంలో ఇది అద్భుతం అని సినిమాల్లో డాక్టర్లు చెప్పడం వింటూనే ఉంటాం... కానీ నిజంగానే జరిగింది. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో గుజరాత్‌కు చెందిన జయసుఖ్‌బాయ్ టక్కర్ జీవితంలో ఈ వింత జరగింది. గుండె సంబంధిత వ్యాధి డిలేటెడ్ కార్డియోమైయోపతి... తీవ్రతరం కావడంతో చికిత్స కోసం చెన్నై వచ్చాడు. వ్యాధి ముదిరిపోయిందనీ, ఈ సమయంలో శస్త్ర చికిత్స సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు. గుండె మార్పిడి ద్వారానే టక్కర్ బతుకుతాడని తేల్చి చెప్పారు. దాతకోసం ప్రయత్నాలు మొదలుపెడుతుండగానే టక్కర్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఎంతకూ సాధ్యం కాలేదు. దీంతో ఈసీపీఆర్ చికిత్సను వెంటనే ప్రయోగించడంతో ముప్పావుగంట తర్వాత టక్కర్ గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారభించింది. ఆ తర్వాత పదిరోజులపాటు కోమాలో ఉన్నాడు. హైదరాబాద్ దాతల సాయంతో టక్కర్‌కు గుండెను మార్చారు. ప్రస్తుతం టక్కర్ కోలుకుంటున్నాడని పోర్టిస్ మలర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
Post a Comment
Thank U For ur Comments