సోషల్ మీడియా నేడు విశ్వ వ్యాప్తమైంది. బ్యాంక్ అకౌంట్ లేనివాళ్లకు కూడా ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉంటోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అనేక సోషల్ మీడియా సైట్లను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారు. అయితే మనిషి చనిపోయిన తర్వాత మీ అకౌంట్ ఏమవుతుంది ? అకౌంట్ కలిగిన వ్యక్తి చనిపోయినట్లుగా సోషల్ మీడియాకు తెలియదు కదా ! మరి అలాంటి వారి అకౌంట్లన్నీ ఏమవుతున్నాయి ? ఫేస్‌బుక్ ఈ వివరాలను వెల్లడించింది. దాదాపు 30 మిలియన్ల ఫేస్‌బుక్ అకౌంట్లు చనిపోయిన వారివేనని యాజమాన్యం తేల్చింది. అంతేకాదు, రోజుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8వేల మంది ఫేస్‌బుక్ యూజర్లు చనిపోతున్నారని కూడా ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. ఫేస్‌బుక్ అకౌంట్ కలిగిన వ్యక్తి తను చనిపోతే ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఉంచాలా, వద్దా అనే విషయాన్ని తెలుపవచ్చని సూచించింది. ఇందుకు సంబంధించి లెగసీ కాంటాక్ట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు.
Post a Comment
Thank U For ur Comments