విక్రమ్, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఇరుమురుగన్'. సినిమాకు సంబంధించిన ఇతర విషయాల సంగతి పక్కన పెడితే…ఈ చిత్రంలో నయనతార చాలా హాట్‌హాట్‌గా కనిపించనుందనే విషయం చర్చనీయాంశం అయింది. గతంతో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో నయనతార హాట్‌గా కనిపించడం తగ్గించింది. అయితే ఈ చిత్రంలో మాత్రం ఆమె మళ్లీ తన గ్లామర్ విశ్వరూపం చూపించబోతోందని, బికినీ సీన్లు, ముద్దు సీన్లతో వెండితెరను మరోసారి వేడెక్కించబోతోందని అంటున్నారు. నయనతార గ్లామర్ ఇష్యూ పక్కన పెట్టి సినిమాకు సంబంధించిన విషయంలోకి వెళితే…ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఇరు ముగన్' సినిమాలో విక్రమ్ సరికొత్తగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ ఎవరూ ఊహించని విధంగా డిఫరెంటుగా ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ రెండు డిపరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తారట.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top