టొరెంటో: సెల్ఫీ పిచ్చి జనాలకి బాగా ఎక్కేసింది. ఎక్కడికెళ్లినా చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే!... ప్రతిదీ సెల్ఫీ తీయాల్సిందే! సెల్ఫీల కోసం కొంతమంది ప్రాణాలను కూడా పణంగా పెట్టిన విషయం తెలిసిందే. సెల్ఫీ మోజులో స్టేజిమీదకి ఎక్కిన ఓ యువతిని ప్రముఖ పాప్ సింగర్ బలంగా కాలితో తన్నాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టొరెంటోలోని మోడ్ క్లబ్‌ థియేటర్‌లో ఏప్రిల్ 10న బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువతీయువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ కెనడా గాయకుడు పార్కర్ కెనాన్ ‘హై రిగార్డ్’ పాటను ఆలపిస్తూ.. ఉత్సాహంతో స్టేజ్‌పై స్టెప్పులేస్తున్నాడు. ఇంతలో ఓ యువతి స్టేజ్‌మీదకు ఎక్కి సెల్ఫీతీసుకుంటోంది. అది గమనించిన సింగర్ కెనాన్ ఆమెను వెనక నుంచి బలంగా తన్నాడు. దీంతో ఆమె ఒక్క సారిగా కింద ఉన్న ప్రేక్షకుల్లోకి పడిపోయింది. ఈ మొత్తం ఘటనంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top