బాలీవుడ్ లో ఇటీవల విడాకుల సీజన్ నడుస్తోంది. విబేధాల కారణంగా ఇటీవల కొన్ని జంటలు విడిపోయాయి. తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్, నటుడు కునాల్ కెమ్ము విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కునాల్ స్పందిస్తూ.. తమకు విడిపోవాలనే ఆలోచనే లేదని చెప్పాడు.'మా వివాహ బంధం చిక్కుల్లో పడిందా? నేను విడాకులు తీసుకోబోతున్నానా? కొంతమంది లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నా భార్య నుంచి విడిపోవడం లేదు' అంటూ కునాల్ ట్వీట్ చేశాడు. 2014లో కునాల్, సోహా లకు పారిస్ లో నిశ్చితార్థం జరిగింది. గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ లు విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరమూ విడిపోతున్నామంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మరో నటి కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ తో విడాకుల విషయంలో ఒప్పందం చేసుకుంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top