యూట్యూబ్‌ను వాడుతున్న వంద కోట్ల మందిలో మీరూ ఒకరా? యూట్యూబ్‌ను ఇంకా సులువుగా వాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇవిగో పది చిట్కాలు. వీటిని ఉపయోగిస్తే మీరు యూట్యూబ్ వీడియోలను ఎంతో ఆనందంగా చూడొచ్చు. మరింక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క చిట్కాను తెలుసుకోండి!
వీడియో రీపీట్ అవ్వాలంటే...
యూట్యూబ్‌లో ఏ వీడియోనైనా లూప్‌లో చూడటానికి అవకాశం కల్పిస్తూ కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా వీడియోను ఓపెన్ చేసి, దానిపై మౌస్ లేదా ట్రాక్‌పాడ్ రైట్ క్లిక్ బటన్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు వచ్చే 'లూప్' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే వీడియో దానంతట అదే రిపీట్ అవుతుంది.
కీబోర్డుతో కూడా పని చేయొచ్చు...
యూట్యూబ్‌ను ప్లే చేయాలంటే మౌస్ లేదా ట్రాక్‌ప్యాడ్‌ను ప్రతిసారీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. కీబోర్డుతో పనిచేయడానికి గూగుల్ అవకాశం ఇస్తోంది. 'www.youtube.com/leanback' తో యూట్యూబ్‌ను ఓపెన్ చేయండి. వెంటనే 'గో కీబోర్డ్ ఓన్లీ' అనే పేరుతో స్క్రీన్ మారుతుంది. ఫలితంగా ప్లే, పాస్, ఫాస్ట్ ఫార్వర్డ్, రివైండ్ వంటి కమాండ్‌లను ఇవ్వడానికి కీబోర్డును వాడుకోవచ్చు. అంతేకాకుండా వీడియోల కోసం, ఛానళ్ళ కోసం కీబోర్డును ఉపయోగించవచ్చు. లైక్ లేదా డిస్‌లైక్ బటన్లను ప్రెస్ చేయడానికి కూడా కీబోర్డును వాడొచ్చు. కే (పాస్ లేదా ప్లే), జే (రివైండ్ 10 సెకండ్స్), ఐ (ఫాస్ట్ ఫార్వర్డ్ 10 సెకండ్స్), ఎం (మ్యూట్), జీరో (వీడియో ప్రారంభం) వంటి కమాండ్‌లతో సులభంగా యూటూబ్‌ను ఉపయోగించవచ్చు. 6 ప్రెస్ చేస్తే 60 శాతం భాగానికి వెళ్ళొచ్చు. అదే విధంగా కావలసిన భాగానికి చేరాలంటే 1 నుంచి 9 వరకు ప్రెస్ చేసి వెళ్ళవచ్చు.
ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంటే...
స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు బఫర్‌లోకి వీడియో వెళ్ళకుండా చేసుకోవచ్చు. 'www.youtube.com/account_playback'కు వెళ్ళి, 'I have a slow internet connection. Never play higher-quality video.' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. హెచ్‌డీ రిజల్యూషన్ వీడియోలను మాత్రమే చూడాలనుకుంటే గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్‌లలో 'మ్యాజిక్ యాక్షన్స్' ఎక్స్‌టెన్షన్‌ను, 'ఆటో హెచ్‌డీ' ఆప్షన్‌ను, ఐడియల్ స్ట్రీమింగ్ రిజల్యూషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
పాట మాత్రమే కావాలా?
ప్లే అవుతున్న ఫేవరెట్ ట్రాక్‌తో పాటు పాడుకోవాలనుకుంటున్నారా? ప్రతిసారీ లిరిక్స్ ప్రింట్ అవుతూ ఇబ్బంది పెడుతున్నాయా? Musixmatch browser extensionను పెట్టుకోండి. వీడియో ప్లే అవుతూండగా లిరిక్స్ కనిపించవు.
మీకు నచ్చిన ఆర్టిస్ట్ వీడియోలే కావాలా?
మీకు నచ్చిన ఆర్టిస్ట్ మ్యూజిక్, వీడియో కోసం సెర్చ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సెర్చ్ బార్‌లో హ్యాష్ టైప్ చేసి, దాని పక్కనే ఆర్టిస్ట్ పేరు రాయండి. మీరు కోరుకున్న ఆర్టిస్ట్‌కు సంబంధించిన మ్యూజిక్, వీడియోలు వస్తాయి. ఈ ఫీచర్ డెస్క్‌టాప్, మొబైల్ సైట్, యాప్‌లలో పని చేస్తుంది.
మీకు నచ్చిన వీడియోనే చూడాలనుకుంటే....
కచ్చితంగా మీరు కోరుకున్నదే రావాలనుకుంటే సెర్చ్ బార్‌లో 'ఆల్ఇన్ టైటిల్' అని టైప్ చేసి, వీడియో టైటిల్‌ను టైప్ చేయాలి. అదే విధంగా హెచ్‌డీ వీడియోలు మాత్రమే రావాలనుకుంటే సెర్చ్ బార్‌లో సాంగ్ పేరు తర్వాత 'హెచ్‌డీ' అని టైప్ చేసి పొందవచ్చు.
స్పీడు పెంచుకోవచ్చు... తగ్గించుకోవచ్చు...
ప్లే అవుతున్న వీడియో వేగాన్ని తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంది. వీడియోపైన ఉన్న సెట్టింగ్స్ బటన్‌ను ప్రెస్ చేసి, దానిలోని స్పీడ్ బటన్‌ను ప్రెస్ చేయాలి. అందులోని వివిధ ఆప్షన్లను మీకు కావలసిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనే పని చేస్తుంది. యాప్‌లలో పని చేయదు.
ప్రైవసీ మెయింటెయిన్ చేయవచ్చు...
మీరు ఏ వీడియోలను ఇష్టపడుతున్నదీ ఇతర యూట్యూబ్ యూజర్లకు తెలియకూడదని భావిస్తే, ఆ సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు. మీ ప్లేలిస్ట్‌లను, మీరు చూసిన ఛానళ్ళను కూడా ఈ విధంగా రహస్యంగా ఉంచవచ్చు. యూట్యూబ్‌ను ఓపెన్ చేసి, అడ్రస్ బార్‌లో 'www.youtube.com/account_privacy' టైప్ చేయాలి. వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్‌లో 'లైక్స్ అండ్ సబ్‌స్క్రిప్షన్స్' కింద ఉన్న రెండు బాక్స్‌లలోనూ టిక్ మార్కులు పెట్టాలి.
ఇష్టమైన వీడియోను కాసేపటి తర్వాత చూసేందుకు సేవ్ చేసుకోవచ్చు
మీకు ఆసక్తి కలిగించే వీడియో కనిపించిందనుకోండి. కానీ దాన్ని అప్పటికప్పుడే చూడటానికి మీకు తగిన సమయం లేకపోతే మరోసారి ఎప్పుడైనా చూసేందుకు దాన్ని సేవ్ చేసి ఉంచుకోవచ్చు. వాచ్ లేటర్ బటన్‌పై క్లిక్ చేస్తే అటువంటి వీడియోలన్నీ ఒక ట్యాబ్ కింద ఉంటాయి.
Post a Comment
Thank U For ur Comments