ఆమె జీతం నెలకు 7500 రూపాయలు. ముంబయిలోని మురికివాడల సమీపంలో ఆమె ఇల్లు. కానీ ఇప్పుడు ఆమె పేరు ప్రపంచానికి తెలిసింది. ఆమె పేరు అనిత డోంగ్రే. ఈ నెల 10న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్‌టన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేట్ ఈ పర్యటనలో చిన్నారులతో సరదా సరదాగా గడిపింది. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడింది. కేట్ ధరించిన డ్రస్ డిజైన్ చేసి కుట్టింది మాత్రం అనిత డోంగ్రే. అయితే ఆ డ్రస్ డిజైన్ చేసే వరకూ కేట్ ఎవరో కూడా అనితకు తెలియదట. తన తోటి ఉద్యోగులు చెబితే ఆ తర్వాత తెలుసుకున్నాని చెబుతోంది. అంతేకాదు తాను డిజైన్ చేసిన డ్రస్‌ను బ్రిటన్ యువరాణి ధరించడం పట్ల అనిత ఆనందం వ్యక్తం చేసింది. కేట్ ధరించిన ఈ డ్రెస్ విలువ 14వేల రూపాయలేనట. ఈ డ్రెస్‌ను బ్రిటన్ యువరాణి ధరించడంతో దేశవిదేశాల నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Post a Comment
Thank U For ur Comments