సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ‘మై ఫస్ట్ వీడియో’ పేరుతో ఓ వీడియో ఈ మధ్య హల్‌చల్ చేసింది. ఆ వీడియోను ఓపెన్ చేసిన స్మార్ట్ ఫోన్, డెస్క్ టాప్‌లు వైరస్ బారినపడ్డాయి. అయితే ఈ వీడియోతో మరో ప్రమాదం కూడా ఉంది. మీ ఫ్రెండ్స్‌కు మీరు ఈ వీడియోను టాగ్ చేయకపోయినా... ఈ వీడియోను క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అందరికీ ట్యాగ్ అవుతుంది. దీనివల్ల మీ ఒక్క స్మార్ట్‌ఫోన్, పీసీయే కాక మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఈ వీడియోను ఓపెన్ చేస్తారో వారి స్మార్ట్‌ఫోన్లు వైరస్‌కు గురిఅవుతాయి. సైబర్ నేరగాళ్లు ఈ వీడియోను రూపొందించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఫేస్‌బుక్ యూజర్లు ఈ వీడియో వైరస్ బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. అందుకే ఈ వీడియోను ఎవరూ ఓపెన్ చేయొద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top